చైతన్య వాహిని
చలం వ్రాసిన " ప్రేమలేఖలు" చదువుతుంటే పురుష పుంగవులు ఇలా కూడా స్పందిస్తారా అని ఆశ్చర్యం కలుగుతుంది. ప్రతి పురుషుడు చలం లాగ వ్రాయలేక పోయినా స్పందించగలిగితే ఏ స్త్రీ జీవితమైనా సార్థకం అవుతుందని అనిపిస్తుంది. కాని అన్ని ఇన్ని అని చెప్పనలవి కానటువంటి ఎన్నెన్నో విధాలైన ముసుగులతో బ్రతికే మగవారికి ఇలాంటి భావాలు కూడా తడతాయా అనిపిస్తుంది. చలం భావాలన్నీ వెరసి ప్రేమ అసలీ పదమే చాలామందికి నచ్చదు. ఏదో సినిమాలో కనిపించే చూపించే అవాస్తవికత అనిపిస్తుంది . నాకే ఈ ఆర్టిస్టిక్ హార్ట్ లేకపోతే ........... అంటాడు చలం.
ఆర్టిస్టిక్ హార్ట్ అంటే ఏమిటి ? అనుభూతిని ఆస్వాదించే మనసు. ఒక రకంగా ఇది అందరిలోనూ ఉంటుందంటారు కొందరు . కాని విచారకమైన విషయం ఏమిటంటే ఆ ఆస్వాదించే అనుభూతి ఒక రుచికరమైన భోజనం, ఒక పెగ్గ్, ఒక సిగరెట్, అర్థరాత్రి హడావడి క్షణాలకు పరిమితమౌతుంది. ఈ శరీరాన్ని మించినది ఒకటి ఏదైనా అస్సలు ఉంటుందనే ధ్యాస ఎందరికి ఉంటుందో మరి. స్త్రీ శరీరాన్ని వాడుకుని, మెదడు లేదని నిర్ణయించి, మనస్సు స్త్రీకి ఉన్న నిర్భలత్వమని చాటిచెప్పే పురుష పుంగవుల మధ్య చలం లాంటి వారు ఉంటారంటే
విచిత్రమనిపిస్తుంది.
విచిత్రమనిపిస్తుంది.
చలం రచనలలో ఎన్నెన్నో సున్నిత లలిత భావాలు. పురుషుడు ఇంత సున్నితంగా, నిశితంగా స్త్రీ హృదయాన్ని చదవగలడా? స్పంది౦చగలడా? చలం స్త్రీ పట్ల నవరసాల వెల్లువై ఆమె హృదయాన్ని నిలువునా ముంచెత్త గలిగాడు. అతని భావాలలో స్త్రీ పట్ల నవవిధా భక్తి , అపారమైన గౌరవభావం వెల్లివిరుస్తాయి. ప్రతి స్త్రీ అలాంటి ఆరాధకున్ని మెచ్చుకునేటంతగా తన భావాలకి సున్నితత్వాన్ని అలంకరించాడు.
ఆదర్శమైన ప్రేమలో వ్యక్తిత్వమే నశించాలి నేను, నువ్వు అన్న భావమే అదృశ్యం కావాలి అంటాడు చలం. అంతటి ప్రేమ కట్నాలకు, బేరసారాలకు, ఒప్పు తప్పులకు పరిమితమై, అందచందాలతో బేరీజు వేయబడి కులగోత్రాల సమక్షంలో జరిగే పెళ్లి ద్వారా మొదలవుతుందా,అసలు జీవితాంతం ఆ జంటలు అటువంటి అనుభూతికి లోనవుతారా అనే సంశయం కలుగుతుంది.
అసలు చలంలాంటి వాళ్ళను నేటి మనోశాస్త్రం అపసామాన్యుల క్రింద జమకడుతుందేమో కాని ఆడవాళ్ళు మాత్రం అతనిని తప్పక గౌరవిస్తారనే భావి౦చుదా౦.
అసలు చలంలాంటి వాళ్ళను నేటి మనోశాస్త్రం అపసామాన్యుల క్రింద జమకడుతుందేమో కాని ఆడవాళ్ళు మాత్రం అతనిని తప్పక గౌరవిస్తారనే భావి౦చుదా౦.
చలం: ప్రేమ లేఖలు
Premalekhalu navala oka purushudu rasinadiga manaku kanpinchadu.Chalamloni streetvam pongi poralina veedhi 'Premalekhalu'.Aa veedhina adugupettina chotalla sukumara komala stree hrudayam manalni munchettutundi.
ReplyDeleteOka naastikudu premanu daivatva sthitilo nilabettina taadaatmyata naku 'Premalekhalu'lo darsanamichchindi.